
సీఎంకు ఎంపీ చామల వినతి
వీరబైరాన్‌పల్లిగా మార్చండి
మద్దూరు (హుస్నాబాద్): దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లి గ్రామాన్ని ప్రభుత్వం వీరబైరాన్‌పల్లిగా పేరు మార్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రజాకార్లకు వ్యతిరేకంగా బైరాన్‌పల్లిలో జరిగిన పోరాటం చరిత్రలో నిలిపోతుందని, వారి దాడిలో 119 మంది అమరులైనట్లు గుర్తు చేశారు. నాటి అమరవీరుల త్యాగాలకు గుర్తు గా గ్రామాన్ని వీరబైరాన్‌పల్లిగా పేరు మార్చుతూ ప్రభుత్వం గెజిట్‌ను విడుదల చేయాలన్నారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. గ్రామంలోని బురుజు, అమరవీరుల స్తూపం మరమ్మతు కోసం ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.