
ఆయిల్ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ సక్సెస్
నంగునూరు(సిద్దిపేట): నర్మేటలో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీలో నిర్వహిస్తున్న ట్రయల్ రన్ శుక్రవారం విజయవంతంగా పూర్తయింది. ఆయిల్ యూనిట్‌లో గింజల నుంచి ఆయిల్ తీస్తూ టెక్నికల్ సిబ్బందితో కలిసి ఆయిల్‌ఫెడ్ అధికారులు లోపాలను గుర్తించారు. ఇంకా పవర్‌ప్లాంట్ యూనిట్‌ను పరీక్షించాల్సి ఉండగా మిగతా పనులు పూర్తి కావడంతో ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ట్రయల్ రన్ పూర్తి కావడంపై ఎమ్మెల్యే హరీశ్‌రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ జరిగిన ఫ్యాక్టరీ నేడు ప్రారంభానికి సిద్ధం కావడం చిరస్మరణీయమన్నారు.

ఆయిల్ ఫ్యాక్టరీలో ట్రయల్ రన్ సక్సెస్