
ఇంటింటా పౌష్టికాహారం
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
దుబ్బాక: శాస్త్ర సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు సాధిస్తున్నా.. ఇంకా పౌష్టికాహారం లోపంతో మాతాశిశు మరణాలు చోటుచేసుకుంటుండటం బాధాకరం. ఆర్థిక పరిస్థితులతో చాలా మంది మహిళలు గర్భంతో ఉన్న సమయంలో సరైన పౌష్టికాహారం తీసుకోకపోతుండటంతో మధ్యలోనే అబార్షన్లు కావడం.. ప్రసవం అయ్యే సమయంలో ఇబ్బందులు తలెత్తి తల్లిబిడ్డలు పురిట్లోనే మరణిస్తున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో మాతా శిశు మరణాలను నివారించడంతోపాటు ఆరోగ్య తెలంగాణ సాధించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే పోషణ మాసోత్సవంతో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. జిల్లా వ్యాప్తంగా పోషకాహార లోపంతో ఉన్నవారిని గుర్తించడంతో పాటు గర్భిణులు, బాలింతల్లో పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నారు.
పౌష్టికాహారం లోపంపై..
పిల్లల సంరక్షణ, పెంపకంపై సరైన అవగాహన లేకపోవడం, పెరుగుదల, ఆటంకాలు, అనారోగ్యాలకు వెంటనే చికిత్స అందించక పోవడం తదితర అంశాల్లో ఇంకా చాలా ప్రగతి సాధించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. పౌష్టికాహార లోపంపై ఐసీడీఎస్ యుద్ధంలా కార్యక్రమాలు చేపడుతూ ప్రగతిని సాధిస్తోంది.
1,150 అంగన్‌వాడీ కేంద్రాలు
జిల్లాలో దుబ్బాక, సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, చేర్యాలలో మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో 1,150 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. గర్భిణులు 6,152, బాలింతలు 4,995, ఐదేళ్లలోపు పిల్లలు 60,836 మంది ఉన్నారు.
వచ్చే నెల 16 వరకు..
ఈ నెల 17న ప్రారంభమైన పోషణ మాసం వచ్చే నెల 16 వరకు చేపడుతున్నారు. జిల్లాలోని 5 ప్రాజెక్టుల పరధిలో సీ్త్ర శిశు సంక్షేమశాఖ జిల్లా అఽధికారి లక్ష్మీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలతో సమావేశాలు చేపట్టడడం పౌష్టికారం లోపం వల్ల జరిగే నష్టాలు తెలియజేస్తున్నారు. ఏ విధమైన ఆహారం తీసుకోవాలి తదితర విషయాలపై సంపూర్ణంగా అవగాహన కల్పిస్తున్నారు. స్వయంగా తయారు చేసిన రకరకాల పౌష్టికారాన్ని అందిస్తూ అంగన్‌వాడీల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
విస్తృతంగా ప్రచారం
గర్భిణులు సరైన పోషకవిలువలతో కూడిన ఆహారం తీసుకోకపోవడంతో పుట్టబోయే పిల్లలు తక్కువ బరువుతో పాటు చాలా రకాల అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. పౌష్టికాహారలోపాలు లేకుండా చూసేందుకు తమ శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నాం. గర్భిణులు పోషకాహారం సక్రమంగా తీసుకుంటనే పండంటి బిడ్డకు జన్మనిస్తారు. పుట్టబోయే బిడ్డ తల్లి ఆరోగ్యవంతంగా ఉంటారు.
– లక్ష్మీకాంతరెడ్డి,
జిల్లా మహిళా శిశు, సంక్షేమ అధికారి
సీ్త్ర శిశుసంక్షేమ శాఖ చర్యలు
విస్తృతంగా పోషణ మాసోత్సవం
ఐదు ఐసీడీఎస్ పరిధిలో1,150 అంగన్‌వాడీ కేంద్రాలు

ఇంటింటా పౌష్టికాహారం

ఇంటింటా పౌష్టికాహారం