
ఉత్తమస్థానం ఉపాధ్యాయుల కృషి ఫలితమే
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
జగదేవ్‌పూర్(గజ్వేల్): ఉపాధ్యాయుల సహకారంతోనే రాష్ట్రంలోనే సిద్దిపేట జిల్లాకు ఉత్తమస్థానం లభించిందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జగదేవ్‌పూర్ మండల విద్యాధికారి మాధవరెడ్డి పదవీ విరమణ అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాధవరెడ్డి మూడు దశాబ్దలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఎన్నో ప్రశంసలు పొందారని గుర్తు చేశారు.
నాడు క్లాస్‌మెంట్.. నేడు ముఖ్య అతిథిగా
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి, మండల విద్యాధికారి మాధవరెడ్డిలు కలిసి చదువుకున్నారు. ఉద్యోగ రీత్యా ఇద్దరు విద్యారంగంలో స్థిరపడ్డారు. శ్రీనివాస్‌రెడ్డి తరగతి గదిలో క్లాస్‌మెంట్‌గా ఉద్యోగంలో జిల్లా అధికారిగా పదవీ విరమణ సభకు హాజరు కావడం విశేషం. మాధవరెడ్డి దంపతులకు డీఈఓ శాలువా కప్పి సన్మానించారు.