
ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని, డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సిద్దిపేటలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థులును ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర కీలకమన్నారు. విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను అభినందించడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుమల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగరాజురెడ్డి, ఆర్థికప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
దుబ్బాక: దసరా నాటికి ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశాలు చేసేలా త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని లబ్ధిదారులకు అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. మంగళవారం దుబ్బాక పట్టణంలోని 15వ, 6వ వార్డుల్లో, చేర్వాపూర్‌లో పర్యటించి ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు, మేసీ్త్రలతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. దుబ్బాక పట్టణం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో వెనుకబడి ఉందన్నారు. ముగ్గులు పోసిన చోట వారం రోజుల్లో బేస్మెంట్ లెవల్ పూర్తికావాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్‌కుమార్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు అనంతుల శ్రీనివాస్, చంద్రారెడ్డి, వార్డు ఆఫీసర్స్ తదితరులు ఉన్నారు.
ఫర్టిలైజర్ దుకాణాలకు నోటీసులు
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలకు నోటీసులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి(ఏఓ) తస్లీమా సుల్తానా మంగళవారం స్థానిక రైతు వేదికలో విలేకరులతో మాట్లాడు తూ వెల్లడించారు. పోతారం(జే) గ్రామంలోని లక్ష్మి ఫర్టిలైజర్ దుకాణం, మల్లంపల్లిలోని రైతు ఉత్పత్తిదారుల సంఘం(ప్రహర్ష), కట్కూర్ లోని సహకార సంఘానికి నోటీసులు ఇచ్చిన ట్లు తెలిపారు. యూరియా బస్తాలు తీసుకెళ్లేందుకు టోకెన్లు ఇవ్వగా, రైతులు ఫర్టిలైజర్ దుకాణానికి వెళ్లేలోపే యూరియా బస్తాలను ఇతరు లకు అమ్మినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పోతారం(జే)లోని ఎరువుల దుకాణం యజ మాని బ్లాక్‌లో బస్తా యూరియాను రూ.500ల కు అమ్మిన్నట్లు తెలిసిందన్నారు. దీంతో సద రు దుకాణదారుడికి నోటీస్ జారీ చేశామన్నా రు. యూరియా బ్లాక్‌లో అమ్మినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
త్వరలో ఉపాధ్యాయ,
ఉద్యోగులకు హెల్త్ కార్డులు
ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి
గజ్వేల్: త్వరలోనే ఉపాధ్యాయ, ఉద్యోగులకు హెల్త్ కార్డులను అందజేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని, షరతుల్లేకుండా కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం లభించనున్నదని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం గజ్వేల్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గఫార్ ఉద్యోగ విరమణ సభ జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని తెలిపారు. మెరుగైన పీఆర్‌సీ ఇప్పించడానికి ప్రయత్నిస్తామన్నారు. ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి మాట్లాడుతూ వృత్తిలో అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులకు గుర్తింపు ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ మండల శాఖ అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి లింగం, రాష్ట్ర నాయకులు వంగ మోహన్‌రెడ్డి, గుండు లక్ష్మన్, జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు