
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పూజల
ప్రశాంత్‌నగర్(సిద్ధిపేట): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు, సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల పూజల హరికృష్ణ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిశానన్నారు. జిల్లా కాంగ్రెస్‌లో కొంత కాలంగా జరుగుతున్న పరిణామాలపై సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. పార్టీలో అంతర్గత విభేదాలపై పార్టీ చూసుకుంటుందని, పట్టించుకోవద్దని తాను అండగా నిలబడతానని ముఖ్యమంత్రి తెలిపారన్నారు.