
సమన్వయంతో విధులు నిర్వహించాలి
● పోలీసు కమిషనర్ అనురాధ ● సిద్దిపేట ఏసీపీ కార్యాలయం, టూటౌన్ పీఎస్ సందర్శన
సిద్దిపేటకమాన్: పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని సీపీ అనురాధ తెలిపారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సిద్దిపేట ఏసీపీ కార్యాలయం, టూటౌన్ పీఎస్‌ను సీపీ మంగళవారం సందర్శించారు. పీఎస్ ఆవరణలో మొక్కను నాటారు. పీఎస్‌లో సీజ్ చేసిన వాహనాలను, పలు రికార్డులను పరిశీలించారు. జిల్లాలో నూతనంగా మహిళా పోలీసు సిబ్బంది నిర్వహించే బ్లూకోల్ట్స్ విధులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫిర్యాదు దారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆన్‌లైన్ గేమ్‌లు, బెట్టింగ్, అక్రమ ఇసుక రవాణపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. వీపీఓలు తరచూ గ్రామాలను సందర్శించాలని సూచించారు. కార్యక్రమంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐలు ఉపేందర్, వాసుదేవరావు, విద్యాసాగర్, శ్రీను, శ్రీధర్‌గౌడ్, కిరణ్, ఎస్‌ఐలు ఆసిఫ్, శ్రీనివాస్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.