
ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సిద్ధం
● ఆయిల్‌ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి ● త్వరలో సీఎం రేవంత్‌తో ప్రారంభిస్తాం ● ఫ్యాక్టరీ పనుల పరిశీలన
నంగునూరు(సిద్దిపేట): నర్మేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రాంరంభోత్సవానికి సిద్ధంగా ఉందని ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం ఫ్యాక్టరీని సందర్శించారు. ట్రయల్‌రన్‌లో భాగంగా ఆయిల్‌పామ్ గింజల కొనుగోలు చేసే ర్యాంపు పనులను ప్రారంభించారు. యంత్రాల పని తీరును పరిశీలించి ఆయిల్‌ఫెడ్ అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల చేతుల మీదుగా ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. ఆయన వెంట ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.