
అదే వరుస.. తప్పని గోస
యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గంటల తరబడి క్యూలో నిల్చుంటున్నా బస్తా యూరియా దొరకడం గగనంగా మారుతోంది. శుక్రవారం మిరుదొడ్డిలో రెండు యూరియా లారీల లోడ్ రావడంతో రైతులు ఒక్కసారిగా కిక్కిరిసి పోయారు. కొందరికి టోకెన్లు లభించక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. మిరుదొడ్డి గోదాం వద్ద పోలీసుల పహారాలో యూరియా పంపిణీ చేశారు. చిన్నకోడూరులో తెల్లవారుజామునే ఫర్టిలైజర్ షాపునకు పరుగులు పెట్టారు. వరుసలో చెప్పులను పెట్టారు. దుబ్బాక పట్టణంలో 5 సెంటర్లలో యూరియా రావడంతో రైతులు ఐదు చోట్ల బారులు తీరారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఒక్క సంచి యూరియా కోసం నానా అవస్థలు పడ్డారు. దూల్మిట్ట మండల కేంద్రంలోని పీఏసీఎస్ గోదాం వద్దకు యూరియా రావడంతో వందలాది మంది రైతులు తరలివచ్చారు. గంటలకొద్దీ నిరీక్షించినా కొంత మందికి యూరియా దొరకకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
– మిరుదొడ్డి(దుబ్బాక)/చిన్నకోడూరు(సిద్దిపేట)/దుబ్బాకటౌన్/మద్దూరు(హుస్నాబాద్)
అక్రమంగా నిల్వ చేసిన యూరియా సీజ్
ఒకరిపై కేసు నమోదు
అక్కన్నపేట(హుస్నాబాద్): ఒకవైపు యూరియా కొరతతో రైతులు అల్లాడుతుంటే మరొపక్క బ్లాక్‌లో యూరియా బస్తాలను అమ్మేస్తున్నారు. మండల పరిధిలోని నందారం గ్రామానికి చెందిన కరివేద సంజీవ్‌రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా యూరియా బస్తాలు నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించి తొమ్మిది బస్తాలను సీజ్ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి తస్లీమా సుల్తానా చెప్పారు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి స్వరూప రాణి హుటాహుటిన సందర్శించారు. అలాగే మండలంలోని పలు ఫర్టిలేజర్ దుకాణాలను తనిఖీ చేశారు. అనంతరం ఏఓ తస్లీమా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోజురోజుకు పెరుగుతున్న
యూరియా అవస్థలు

అదే వరుస.. తప్పని గోస

అదే వరుస.. తప్పని గోస