
రోడ్లు కోత.. పయనం వెత
అక్కన్నపేట మండలం ధర్మారం, పోతారం(జే), మైసమ్మవాగుతండా గ్రామాల్లో రోడ్లన్నీ ఛిద్రమయ్యాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి కోతకు గురయ్యాయి. తాటివనం బ్రిడ్జి వద్ద రోడ్డు ధ్వంసం కావడంతో ప్రయాణం ప్రమాదంగా మారింది. అలాగే పలు చోట్ల సైడ్ బర్ములు కొట్టుకుపోయ్యాయి. ధర్మారం వెళ్లే మార్గంలో బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురై వరి పొలంలో ఇసుక మేటలు వేశాయి. ఎలాంటి ప్రమాదాలు, ప్రాణనష్టం జరగక ముందే సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
– అక్కన్నపేట(హుస్నాబాద్)

రోడ్లు కోత.. పయనం వెత