
జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోలు శక్తి
మెదక్ ఎంపీ రఘునందన్‌రావు
గజ్వేల్: ప్రధాని మోదీ కృషి వల్ల భారత్ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నదని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం రాత్రి గజ్వేల్‌లో జీఎస్టీ తగ్గింపుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ గడిచిన 11 ఏళ్లలో మోదీ తీసుకొచ్చిన సంస్కరణల వల్ల దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడానికి కేంద్రం జీఎస్టీని తగ్గించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేసిందన్నారు. మరోవైపు 12లక్షల లావాదేవీలకు వరకు ఇన్‌కమ్ ట్యాక్స్‌ను రద్దు చేయడం ద్వారా మధ్య తరగతి ప్రజలకు భారీ మేలు జరిగిందన్నారు. నేడు అమెరికా ఎన్ని రకాల బెదిరింపులకు పాల్పడు తున్నా నరేంద్రమోదీ తనదైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారని కొనియాడారు. సదస్సులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పోరాట స్మృతి చిహ్నాలను
కాపాడాలి
మద్దూరు(హుస్నాబాద్): పోరాట స్మృతి చిహ్నా లను కాపాడాలని, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ కోరారు. శుక్రవారం దూల్మిట్ట మండలం బైరాన్‌పల్లిలో రజాకార్ల దాడిలో అమరులైన 118కి బురుజు, స్తూపం వద్ద నివాళుర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రని బీజేపీ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. గుండ్రంపల్లి, బైరాన్‌పల్లి, కూటిగల్ లాంటి ఖిల్లాలను గుర్తిస్తూ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.
గొల్ల కురుమలపై సర్కార్ వివక్ష
సిద్దిపేటజోన్: కాంగ్రెస్ ప్రభుత్వం గొల్ల కురుమల పట్ల వివక్ష చూపుతోందని రాష్ట్ర గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీహరి ఆరోపించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లా డారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కురుమల సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వలేదన్నారు. పశు సంవర్ధక శాఖ ద్వారా నట్టల మందులు సరఫరా చేయాలని, పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల రూపాయల నగదు బదిలీ చేయలన్నారు. నూతన సొసైటీలు ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ఐలయ్య, పట్టణ శాఖ అధ్యక్షుడు ఎల్లయ్య, నాయకులు పాల్గొన్నారు.

జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోలు శక్తి

జీఎస్టీ తగ్గింపుతో పెరిగిన కొనుగోలు శక్తి