
మత్తళ్లు.. పరవళ్లు
రెండు రోజులుగా కురిసిన వర్షాలకు జలాశయాలన్నీ జలకళను సంతరించుకున్నాయి. నంగునూరు, పాలమాకుల, బద్దిపడగ, రాంపూర్, మగ్ధుంపూర్, సిద్దన్నపేట, అంక్షాపూర్, నాగరాజుపల్లి, నర్మేట లోని చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి. నంగునూరు మండలం గుండా ప్రవహించే మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చెక్‌డ్యామ్‌లు పరవళ్లు తొక్కుతున్నాయి. కాగా భారీ వర్షాలతో అక్కేనపల్లి లోని బుడగ జంగాల కాలనీ నీట మునిగింది. నిత్యావసర సరుకులు కొట్టుకుపోయాయి. హుస్నాబాద్ మండలంలోని వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. మత్స్యకారులు చేపలు పడుతుండటంతో చెరవుల వద్ద సందడి నెలకొంది. అక్కన్నపేట మండలం గండిపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద చేరడంతో నిండుకుండను తలపిస్తోంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 0.5టీఎంసీలు. కొన్ని రోజులుగా నీళ్లు లేక ఎండిన ప్రాజెక్టులో నీళ్లు చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
– నంగునూరు(సిద్దిపేట)/హుస్నాబాద్‌రూరల్/అక్కన్నపేట(హుస్నాబాద్)

మత్తళ్లు.. పరవళ్లు