
అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం
సిద్దిపేటరూరల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందిస్తున్న అర్జీల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్ హైమావతి తెలిపారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను పూర్తి స్థాయిలో పరిశీలించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూ సమస్యలు, పలు సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తంగా 168 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు గరీమా అగర్వాల్, అబ్దుల్ హమీద్, డీఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రశీదు కౌంటర్ వద్ద గందరగోళం
ప్రజావాణిలో భాగంగా దరఖాస్తు అందించిన అనంతరం రశీదు అందించే కౌంటర్ వద్ద గందరగోళం నెలకొంది. రశీదు కోసం గంటల తరబడి వేడిచూడాల్సి వచ్చింది. అధికారులు మరో కౌంటర్ ఏర్పాటు చేసి రశీదు అందిస్తే బాగుంటుందని పలువురు కోరారు.
కలెక్టర్ హైమావతి
ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ