
కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ రాస్తారోకో
ములుగు(గజ్వేల్): హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలోని రాజీవ్‌రహదారిపై సోమవారం బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల మాట్లాడుతూ ఆరు గ్యారంటీల అమలు, రైతులకు సరిపోను యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతులు వ్యవసాయ పనులు మానేసి రోజూ యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన కారులకు నచ్చచెప్పడంతో ఆందోళన విరమింప జేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌గౌడ్ జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి బాగ్యలక్ష్మి, నాయకులు రమేష్‌యాదవ్, కృష్ణయాదవ్, హరికృష్ణ, శ్రీకాంత్, అరుణ్, రమేష్, ఎలేందర్‌రెడ్డి, కనుకయ్య, ప్రవీణ్‌గౌడ్, కర్ణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.