
ప్రభుత్వ బడుల్లోనే చదువుదాం
అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని, అందులోభాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్ .. విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని కన్నారం గ్రామంలో మోదీ కానుకగా పదో తరగతి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సైకిల్ పంపిణీ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. రానున్న రోజుల్లో 8, 9వ తరగతి విద్యార్థులకు సైతం సైకిళ్లు అందజేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ గుగులోతు రంగానాయక్, అసెంబ్లీ కో–కన్వీనర్ వేణుగోపాల్‌రావు పాల్గొన్నారు.