
బ్యాంకు సేవలుసద్వినియోగం చేసుకోండి
అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్
కొండపాక(గజ్వేల్): ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండి, బ్యాంకులు అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. సోమవారం కొండపాకలో ఆర్థిక పరమైన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎలాంటి రుణాలు కావాలన్నా ప్రభుత్వ బ్యాంకుల నుంచే పొందాలని, ప్రైవేట్ బ్యాంకులను ఆశ్రయించి ఇబ్బందులకు గురికావద్దన్నారు. ఆన్‌లైన్ మోసాలకు గురైతే వెంటనే 1930 కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఏజీఎం రితీష్ పటేల్, డీసీసీబీ సీఈఓ శ్రీనివాస్, బ్యాంకు అధికారులు తదితరులు పాల్గొన్నారు