
వండర్ బుక్‌లో విశ్వేశ్వర్‌రావు
గజ్వేల్‌రూరల్: గజ్వేల్ ప్రాంతానికి చెందిన పాటల రచయిత, స్వరకర్త, గాయకుడు రాయారావు విశ్వేశ్వర్‌రావుకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో స్థానం దక్కింది. 2019 నుంచి 2025 వరకు ప్రతియేటా అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా పాటలు రాయడంతో పాటు వాటిని కంపోజ్ చేయడం ద్వారా అద్భుతమైన ఘనతను సాధించడంతో లండన్ సంస్థ గుర్తించింది. ఈ సందర్భంగా శనివారం నగరంలోని వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ కార్యాలయంలో సంస్థ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ నరేందర్‌గౌడ్ విశ్వేశ్వర్‌రావుకు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఆదివారం గజ్వేల్‌లో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, నాయకులు, పట్టణ వాసులు సన్మానించారు.