
శాశ్వత పరిష్కారం దిశగా..
భవిష్యత్‌లో ఇంతకంటే రెట్టింపు స్థాయిలో వరద ప్రవాహం వచ్చినప్పటికీ సమస్య రాకుండా రెవెన్యూ, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే బఫర్ జోన్ నియమావళి మేరకు ఫీడర్ ఛానల్‌కు ఇరువైపులా నిర్మాణాలు.. కట్టడాలు లేకుండా చూడటంతో పాటు ఫీడర్ ఛానల్ ఇరువైపులా రేలింగ్ ఎత్తు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు సమాచారం. అందుకు అనుగుణంగా ఇటీవల బల్దియా అధికారులు కోమటి చెరువు ఫీడర్ ఛానల్ ఆద్యంతం సర్వే చేసి సుమారు 15 కట్టడాలు ఇరిగేషన్ నిబంధనలు అతిక్రమించి నిర్మాణం చేపట్టినట్లు గుర్తించారు. వాటికి సంబంధించి నోటీసుల జారీ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. శాశ్వత పరిష్కారం దిశగా ఫీడర్ ఛానల్ ఇరువైపులా రెవెన్యూ, మున్సిపల్, నీటిపారుదల శాఖ సంయుక్తంగా హద్దులు నిర్ణయించే ప్రక్రియకు ప్రణాళికలు తయారు చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకు సాగేందుకు అధికార యంత్రాంగం వేచిచూస్తోంది.