
ఫాగింగ్‌కూ డబ్బులు లేవట
● ఇట్లయితే మున్సిపాలిటీ నడిచేదెట్లా..
● అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటజోన్: ‘సిద్దిపేట లాంటి పెద్ద మున్సిపాలిటీలో ప్రస్తుతం ఫాగింగ్‌కూ డబ్బులు లేని పరిస్థితి. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టణ ప్రగతి నిధులు ఇచ్చేది. ఇప్పుడున్న ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇట్లయితే మున్సిపాలిటీ ఎలా కొనసాగాలి’ అని అసెంబ్లీలో మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రస్తావించారు. ఆదివారం శాసనసభ సమావేశాల్లో భాగంగా మున్సిపల్‌శాఖ బిల్లు అంశంపై చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. సిద్దిపేట బల్దియా అంశంపై మాట్లాడుతూ పట్టణ ప్రగతి నిధులు లేవని, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదన్నారు. రూపాయి లేకుండా మున్సిపాలిటీ ఎలా కొనసాగాలన్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పరిస్థితి అయోమయంగా ఉందని, సిద్దిపేట మున్సిపాలిటీలో ముగ్గురు శానిటరీ ఇన్‌స్పెక్టర్లకుగాను ఒక్కరూ లేరన్నారు. అన్ని ఖాళీగా ఉంటే ఎట్లా అని ప్రశ్నించారు.