
అన్నదాత అగచాట్లు
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2025
యూరియా కోసం నిత్యం ఎదురు చూపులు
సాక్షి, సిద్దిపేట: జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. సాగు పనులు చేయాల్సిన రైతులు. యూరియా బస్తాల కోసం అనేక అవస్థలు పడుతున్నారు. 25 రోజులుగా పీఏసీఎస్, ఆగ్రోస్ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎరువుల బస్తాల కోసం ఇళ్లు వదిలి అర్థరాత్రి నుంచే పీఏసీఎస్ కేంద్రాల ముందు నిరీక్షిస్తున్నారు. సమయానికి యూరియా వేయకపోతే పంట దిగుబడి తగ్గి.. పెట్టిన పెట్టుబడులు నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో వరి 3,31,020 ఎకరాలు, పత్తి 1,06,921, మొక్క జొన్న 27,826, కంది 6,594లతో పాటు ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంటలు వేసిన 20 రోజుల్లోపే యూరియా చల్లాలని ఆ తర్వాత వేసినప్పటికీ దిగుబడి తగ్గుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదను దాటితే ఇబ్బంది పడాల్సి వస్తుందని రైతులు యూరియా బస్తాల కోసం రోజుల తరబడి సొసైటీ కేంద్రాల ముందు నిరీక్షిస్తున్నారు. చెప్పులు, ఆధార్ కార్డులు, పట్టా పాస్ బుక్‌లు, రాళ్లు క్యూ లైన్లుగా పెడుతున్నారు. వర్షాలను సైతం లెక్కచేయకుండా క్యూ లైన్లలో ఉంటూ రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు బ్లాక్‌లో విక్రయిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినవస్తున్నాయి.
జిల్లాకు వచ్చింది 59శాతమే
జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్‌లో 4,65,318 ఎకరాల్లో సాగు అవుతందని ఈ సీజన్‌కు 43,130.8 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 25,780 (59.77శాతం) మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా అయింది. అందులో సొసైటీలకు 15,468 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్‌కు 10,312 మెట్రిక్ టన్నులు కేటాయించారు. ఇంకా ఇరవై రోజుల సమయం మాత్రమే ఉంది. సెప్టెంబర్ 20వ తేదీ వరకు పూర్తిగా యూరియా జిల్లాకు చేరాలంటే రోజుకు వెయ్యి మెట్రిక్ టన్నులు వస్తేనే సరిపోతుంది. వ్యవసాయ అధికారులు 4.65లక్షలు సాగు అవుతుందని, దానికి సరఫరా యూరియాను అంచనా వేశారు కానీ ఇప్పటికే 4.90లక్షలకు పైగా వివిధ పంటలు సాగు చేస్తున్నారు. దీని ప్రకారం చూస్తే అధికారులు అంచనా వేసిన దానికంటే ఎక్కువ యూరియా అవసరం పడనుంది.
గరికపోసలతో
గణనాథుడి అలంకరణ
దుబ్బాకలో వినాయక చవితి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం పట్టణంలో కేదారేశ్వర ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణనాథున్ని 4 లక్షల గరిక పోసలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు.
– దుబ్బాకటౌన్ :
మిరుదొడ్డికి చెందిన రాములు ఒక ఎకరంలో మొక్కజొన్నను సాగు చేస్తున్నాడు. దుక్కి దున్ని విత్తనం పెట్టి 44 రోజులు కావస్తుంది. ఇప్పటి వరకు యూరియా లభించకపోవడంతో చల్లలేదు. పదిరోజులుగా యూరియా బస్తాల కోసం తిరుగుతున్నా ఒక్కటి లభించలేదు. యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నా దొరకడం లేదు. పెట్టిన పెట్టుబడి సైతం వస్తుందో రాదో అని రైతు రాములు ఆందోళన చెందుతున్నాడు.
43వేల మెట్రిక్ టన్నులకు.. వచ్చింది 25వేల మెట్రిక్ టన్నులే
4.90లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు
అదను దాటిపోతుందని ఆందోళన

అన్నదాత అగచాట్లు

అన్నదాత అగచాట్లు