
మల్లన్న సాగర్‌ను సందర్శించిన ఐఏఎస్‌లు
తొగుట(దుబ్బాక): కొమురవెల్లి మల్లన్న సాగర్ రిజర్వాయర్‌ను ఐఏఎస్ అధికారులు శనివారం సందర్శించారు. మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి సందర్శించిన వారిలో ఉన్నారు. వారితో పాటు మల్లన్న సాగర్ అధికారులు పాల్గొన్నారు.
కొండపోచమ్మ సందర్శన
మర్కూక్(గజ్వేల్): కొండపోచమ్మ సాగర్‌ను మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఆర్‌డిసిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, ఎంఆర్‌డిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇవి నర్సింహారెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మూసీ రివర్ ఫ్రంట్ అభివృధ్ది ప్రాజెక్ట్‌లో చేపట్టబోతున్న రేవెట్‌మెంట్‌లు, గేబియన్ వాల్ నిర్మాణ పనుల విధానాలను సమిక్షించారు. సంబందిత పనులలో అనుసరించబోయే సాంకేతికత, నాణ్యత ప్రమాణాలు మరియు నిర్మాణ విధానాలపై ఆరా తీశారు. అనంతరం కొండపోచ మ్మ సాగర్ నుంచి సంగారెడ్డికి వెళ్లే కాల్వను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.
సృజనాత్మకతతో బోధించాలి
జిల్లా కోఆర్డినేటర్ రమేష్
దుబ్బాకటౌన్: విద్యార్థులకు బోధన అభ్యాస సామగ్రి పద్ధతిని ఉపయోగించి సృజనాత్మకతతో విద్యాబోధన చేస్తే సులభంగా పాఠ్యాంశాలు అర్థమవుతాయని జిల్లా కోఆర్టినేటర్ రమేష్, మండల విద్యాధికారి జోగు ప్రభుదాస్ అన్నారు. శనివారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్లో మండల స్థాయి బోధన అభ్యాస సామగ్రి మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలలో బోధన పద్ధతులు సృజనాత్మకతతో మెరుగుపరుచుకోవాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ బుచ్చిబాబు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులున్నారు.

మల్లన్న సాగర్‌ను సందర్శించిన ఐఏఎస్‌లు