
విద్యుత్ మీటర్లు కాలిపోయాయి
అపార్ట్మెంట్లో 21 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నా. గత 12 ఏళ్ల క్రితం ఇలా వరద వచ్చింది. మళ్లీ ఇప్పుడు వచ్చింది. వరద చేరుతుంటే అప్రమత్తమై మా వాహనాలు అన్ని గుడి దగ్గర పార్కింగ్ చేసి వచ్చాం. మా పార్కింగ్‌లోకి దాదాపు నాలుగు ఫీట్ల ఎత్తు వరకు నీరు వచ్చింది. ఆరు విద్యుత్ మీటర్లు కాలి పోయాయి. పవర్ ఇంకా రాలేదు. మా అపార్ట్‌మెంట్ సమీపంలోని కెనాల్ కాలువలో కాలువలో సిల్ట్ తీయడమే లేదు. కెనాల్ కాలువ ఎత్తు పెంచి వరద నీరు బయటకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– నర్సింహారెడ్డి, సతీష్, మణికంఠ అపార్ట్‌మెంట్, హరిప్రియనగర్
బియ్యం తడిసిపోయాయి
ఇంట్లోకి ఒక్కసారిగా వరద రావడంతో భయంతో బయటకు వచ్చాం. గ్యాస్ సిలిండర్‌ను తీసుకుని బయటకు వచ్చి మెట్ల పైన ఉన్నాం. బియ్యం, కారం, పప్పు, పసుపు తడిసిపోయాయి. ఇళ్లు అంతా బురద మయమైంది. నీళ్లు బయటకు పోవడంతో బురద తొలగించాం. నా కొడుకు సర్టిఫికెట్లు సైతం తడిచాయి.
– లక్ష్మీ, హరిప్రియనగర్, సిద్దిపేట పట్టణం

విద్యుత్ మీటర్లు కాలిపోయాయి