ప్రభుత్వ మెడలు వంచుతాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ మెడలు వంచుతాం

Aug 8 2025 9:13 AM | Updated on Aug 8 2025 9:13 AM

ప్రభుత్వ మెడలు వంచుతాం

ప్రభుత్వ మెడలు వంచుతాం

మెదక్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వ మెడలు వంచి ఇచ్చిన హామీలు అమలు చేసేలా బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ వద్ద నిర్వహించిన రైతు మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధర్నాకు వచ్చిన రైతుల్లో ఎంతమందికి రుణమాఫీ కాలేదో చేతులు ఎత్తాలని కోరగా, 30 శాతం మంది చేతులు ఎత్తారు. అలాగే బోనస్‌ రాని రైతులు ఎంతమంది అని పేర్కొనగా.. అక్కడున్న వారంతా చేతులు ఎత్తారు. ఇదీ కాంగ్రెస్‌ సర్కారు తీరని ఎద్దేవా చేశారు. కాగా ధర్నా మధ్యలో హరీశ్‌రావుకు ఫోన్‌ రావడంతో మళ్లీ వచ్చి జాయిన్‌ అవుతానంటూ వెళ్లిపోయారు. అనంతరం నాయకులు కలెక్టరేట్‌కు వెళ్లి డీఆర్‌ఓ భుజంగరావుకు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు.

కాంగ్రెస్‌– బీజేపీ మిలాఖత్‌:

మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లు మిలాఖత్‌ అయ్యాయని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. మోదీ, రేవంత్‌ కేసీఆర్‌ మీదికి ఒంటికాలిపై లేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేవలం ఈటల రాజేందర్‌, వెంకటరమణారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తప్ప, మిగితా వారంతా రేవంత్‌రెడ్డికే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రైతులు ఎరువుల కోసం చెప్పులు వరుసలో పెట్టాల్సిన దుస్థితి మళ్లీ వచ్చిందని వాపోయారు.

ప్రాజెక్టుల గేట్లు బద్దలు కొడతాం

జిల్లాకు సాగు నీరు విడుదల చేయకపోతే ప్రాజెక్ట్‌ల గేట్లు బద్దలు కొట్టి రైతుల పొలాలకు నీళ్లు వదులుతామని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు నీరందించే ప్రాజెక్టులపై ఒక్కసారి కూడా సమీక్ష జరిపిన పాపానపోలేదని ఎమ్మెల్యే అన్నారు.

హామీలు అమలు చేయిస్తాం

సగం మందికే రుణమాఫీ..

సన్న వడ్లకు బోనస్‌ అందలేదు

రైతు ధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement