
సోలిపేట జీవితం స్ఫూర్తిదాయకం
దుబ్బాక: పేదలకోసమే జీవించిన గొప్ప నేత సోలిపేట రామలింగారెడ్డి అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. బుధవారం స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా సతీమణి సుజాతక్క, కుమారుడు సతీష్‌రెడ్డితో కలిసి దుబ్బాకలోని డబుల్‌బెడ్రూం కాలనీ, ఆయన స్వగ్రామం చిట్టాపూర్‌లోని రామలింగారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నక్సలైట్‌గా, జర్నలిస్టుగా, శాసనసభ్యుడిగా తన జీవితమంతా పేదల కోసమే పనిచేశారన్నారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా, శాసనసభ అంచనాల కమిటీ చైర్మన్‌గా ఉన్నా అత్యంత సాధారణ జీవితం గడిపిన గొప్పనేత అని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.