
గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శుభకర శ్రావణ మాసం వేళ.. సుప్రసిద్ధ వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రం బుధవారం మూల మహోత్సవ వేడుకలతో అలరారింది. అర్చనలు, చిన్నారుల అక్షరస్వీకార పూజలతో శోభిల్లింది. సరస్వతి మాత మూలవిరాట్టుకు విశేష పంచామృతాభిషేకం చేశారు. పట్టువస్త్రాలు, సర్వాభరణాలు, నిండుగా పూలమాలలతో అలంకరించారు.
వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారి నామం స్మరిస్తూ భక్తులు సామూహిక లక్షపుష్పార్చన చేశారు. యాగశాలలో చండీ హోమం, మహాపూర్ణాహుతి నిర్వహించారు. సరస్వతి సన్నిధిలో భారీగా చిన్నారులు అక్షరాభ్యాసాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. – వర్గల్ (గజ్వేల్)

గురువారం శ్రీ 7 శ్రీ ఆగస్టు శ్రీ 2025