
చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలి
కొమురవెల్లి(సిద్దిపేట): చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేవరకు పోరాటం కొనసాగుతుందని జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్య పేర్కొన్నారు. చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధనకోసం మండలంలోని అన్నిగ్రామాల్లో మంగళవారం బైక్‌ర్యాలీ నిర్వహించి మండల కేంద్రంలో తహసీల్దార్ దివ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...కొంతకాలంగా చేర్యాల రెవెన్యూ డివిజన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించకపోతే జేఏసీ ఆధ్వర్యంలో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, దూల్మెట్ట మండలాల ప్రజలను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నాయకులు మల్లారెడ్డి, సత్తిరెడ్డి, బూర్గు సురేశ్, ముస్త్యాల బాల్‌నర్సయ్య, శ్రీధర్‌రెడ్డి, గీస భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
జేఏసీ చైర్మన్ వకుళాభరణం నర్సయ్య