దుబ్బాక బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయకమిటీ ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కనులపండువగా జరిగింది. ఆలయంలో వేదపండితులు నిత్యహోమం, సుదర్శన హోమం,మూలమంత్ర జపహోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పద్మావతి వెంకటేశ్వర స్వామి కల్యాణం బుధవారం జరుగనుంది. ఈ సందర్భంగా పట్టణంలోని స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు,పుస్తె, మెట్టెలు సమర్పించారు. కాగా, స్వామివారి దర్శనానికి మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. దుబ్బాక:
న్యూస్‌రీల్
కనులపండువగా బాలాజీ బ్రహ్మోత్సవాలు
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025
బుధవారం శ్రీ 6 శ్రీ ఆగస్టు శ్రీ 2025