ప్రయాణం సులువే! | - | Sakshi
Sakshi News home page

ప్రయాణం సులువే!

Aug 5 2025 8:49 AM | Updated on Aug 5 2025 8:49 AM

ప్రయా

ప్రయాణం సులువే!

మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025
ఎక్స్‌ప్రెస్‌వే..
తెరపైకి కొత్త ప్రతిపాదన

సిద్దిపేట జిల్లాలో రాజీవ్‌రహదారి

గజ్వేల్‌: మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట నుంచి సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల మీదుగా మంచిర్యాల, రామగుండం ప్రాంతం వరకు 207కిలోమీటర్ల మేర రాజీవ్‌ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించారు. 15ఏళ్ల క్రితం ఈ రోడ్డు విస్తరణకు రూ.1,450కోట్లకుపైగా వెచ్చించారు. బీఓటీ(బిల్ట్‌ ఆపరేటర్‌ ట్రాన్స్‌ఫర్‌) విధానంలో ఈ పనులు పూర్తి చేశారు. ఉత్తర తెలంగాణలోని మేడ్చల్‌, సిద్దిపేట, ఉమ్మడి కరీంనగర్‌, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాల్లో గల పలు జాతీయ రహదారులను కలిపే ఈ దారి అత్యంత కీలకమైనది. ప్రత్యేకించి హైదరాబాద్‌ ఔటర్‌ రింగురోడ్డు, వరంగల్‌ హైవే, నేషనల్‌ హైవే–44 తదితర హైవేలతోపాటు కొత్తగా నిర్మించనున్న ట్రిపుల్‌ఆర్‌తోనూ ఈ రహదారి అనుసంధానం కానుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ రహదారి మలుపులు సరిచేయకుండానే విస్తరణ పనులు చేపట్టిన కారణంగా తరుచూ ఎన్నో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

ఎలివేటెడ్‌ కారిడార్‌తో అనుసంధానం..

రాజీవ్‌ రహదారిపై మలుపులు సరిచేయడం, ఆరు లేన్లుగా విస్తరించే అంశాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. ఈ క్రమంలో రాజీవ్‌రహదారికి ప్రత్యామ్నాయంగా ఎక్స్‌ప్రెస్‌వేను నిర్మించాలని భావిస్తోంది. ఇది పూర్తిగా గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేగా ఉంటుందని చెబుతున్నారు. సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట వరకు 18కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ కారిడార్‌తో ఎక్స్‌ప్రెస్‌వేను అనుసంధానం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రూ.4వేలకోట్లకుపైగా వ్యయం అవుతుందని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు ప్రతిపాదనలు పంపింది.

న్యూస్‌రీల్‌

సిద్దిపేట జిల్లాలో 90 కి.మీటర్లపైనే!

ఆర్‌ఆర్‌కు ప్రత్యామ్నాయంగాకొత్త రహదారి

శామీర్‌పేట నుంచి రామగుండం వరకు 207కిలోమీటర్లు

సిద్దిపేటతోపాటు ఉత్తర తెలంగాణకు ప్రయోజనం!

రాజీవ్‌ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ పెరిగి ప్రమాద ఘంటికలు మోగుతున్న వేళ... ఈ రహదారికి ప్రత్యామ్నాయంగా ఎక్స్‌ప్రెస్‌వే తీసుకురావాలనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. సిద్దిపేటతోపాటు ఇతర ఉత్తర తెలంగాణ జిల్లాల రాకపోకలకు రాజీవ్‌రహదారి కీలకం. ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వే కార్యరూపంలోకి వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరనుంది.

రాజీవ్‌ రహదారి సిద్దిపేట జిల్లాలో ములుగు మండలం వంటిమామిడి నుంచి బెజ్జంకి మండలం దేవక్కపల్లి వరకు సుమారుగా 90కిలోమీటర్లకుపైగా విస్తరించి ఉంది. రాజీవ్‌రహదారికి ప్రత్యామ్నాయంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదన కార్యరూపంలోకి వస్తే ఈ జిల్లాలోనే సింహభాగం విస్తరించే అవకాశముంది. దీంతో ప్రత్యేకించి సిద్దిపేట జిల్లాలోని ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ప్రయాణం ట్రాఫిక్‌ చిక్కుల్లేకుండా మరింత సులువుగా మారనుంది. ప్రత్యేకించి గజ్వేల్‌ ప్రాంతానికి హైదరాబాద్‌ మరింతగా చేరువగా మారనుంది. ఇప్పటికే ఈ నియోజకవర్గంలోని ములుగు, మర్కూక్‌, వర్గల్‌, గజ్వేల్‌ మండలాలు మెగా హెచ్‌ఎండీఏ పరిధిలోకి వెళ్తున్నాయి. ఈ ఎక్స్‌ప్రెస్‌వే ప్రతిపాదన ఈ ప్రాంతానికి కలిసిరానున్నది. అదేవిధంగా ఉత్తర తెలంగాణలోని ఇతర జిల్లాలకు సైతం ప్రయోజనం చేకూరనుంది.

ప్రయాణం సులువే!1
1/1

ప్రయాణం సులువే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement