
ఉమ్మడి జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
మిరుదొడ్డి(దుబ్బాక): ఉమ్మడి మెదక్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీనియర్, సబ్ జూనియర్ అండర్–15 బాల్ బ్యాడ్మింటన్ ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ భైరయ్య తెలిపారు. మిరుదొడ్డిలో సోమవారం ఆయన మాట్లా డుతూ..సీనియర్ జట్టుకు శశికుమార్, శ్రీనివాస్, చైతన్య, భరత్, కృష్ణసాయి, రవి, కిరణ్, రవితేజ, నవీన్, స్టాండ్ బాయ్స్‌గా మునీరొద్దీన్, రామ కోటి ఎంపికయ్యారన్నారు. బాలికల సబ్ జూనియర్ జట్టుకు శ్రావణి, నిహారిక, నందిత, లలిత, శరణ్య, సఫియా, సోహ, జెస్సీ, మనోవర్ధిని, శ్రీతేజ, తన్విలు ఎంపిక కాగా, సబ్ జూనియర్ బాయ్స్ జట్టులో చైతన్య, కృష్ణసాయి, సిద్విక్, మనికంఠ, సాకేత్, మోయిన్, భవన్, అక్షిత్, లలిత్, కౌశిక్, ఆర్యలు ఎంపికయ్యారు. ఈ నెల 23, 24 తేదీల్లో రాష్ట్రస్థాయి సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలో సీనియర్ జట్లు పాల్గొంటాయని తెలిపారు.