
తెలవారే.. తొలి దర్శనం
దుబ్బాక: తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన దుబ్బాక బాలాజీ ఆలయం చతుర్థ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితులు పుణ్యాహవచనంతో బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధిగొల్ల(యాదవులు) ఆల యం తెరిచే ఆచారాన్ని బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిసారి దుబ్బాక బాలాజీ ఆలయంలో చేపట్టారు. సోమవారం తెల్లవారుఝామునే యాదవులు కుటుంబసమేతంగా పట్టణంలో పట్టువస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి వచ్చి స్వామివారి తొలిదర్శనాన్ని చేసుకున్నారు. అనంతరం సంతానం కోసం నిర్వహించిన ప్రత్యేక హోమం కార్యక్రమానికి 2వేలకు పైగా దంపతులు హాజరై గరుడ ప్రసాదాలను స్వీకరించారు. కాగా, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

తెలవారే.. తొలి దర్శనం