
సీపీఎస్ రద్దు చేయాలి
పీఆర్‌టీయూ రాష్ట్ర
కార్యదర్శి మహేందర్‌రెడ్డి
చిన్నకోడూరు(సిద్దిపేట): సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛను విధానాన్ని అమలు చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర కార్యదర్శి వంగ మహేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చిన్నకోడూరు ఉన్నత పాఠశాలలో సోమవారం సభ్యత్వ నమోదులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దును డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న పీఆర్టీయూ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నానో యూరియా డాప్‌తో అధిక దిగుబడులు
జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి
కొండపాక(గజ్వేల్): నానో యూరియా డాప్ వినియోగంతో అధిక దిగుబడులు పొంద వచ్చని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి పేర్కొన్నారు. మండల పరిధిలోని బందారం గ్రామంలో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కో ఆపరేటివ్ లిమిటెడ్ సంస్థ, వ్యవసా య శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నానో యూరియా డాప్‌ల వినియోగంపై సోమ వారం రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ...నానో యూరియాను పిచికారీ చేయడం వల్ల కాలుష్యం తగ్గించడంతో పాటు సమర్థవంతంగా పంటలకు ఉపయోగపడుతుందన్నా రు. 500 మిల్లీ లీటర్ల నానో యూరియా తక్కువ ధరకే లభిస్తుందని తెలిపారు.