
యూరియా కోసం బారులు
● పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ ● క్యూలో ఉన్నా చాలామందిరైతులకు అందని వైనం
దుబ్బాక: ప్రభుత్వం, అధికారులు యూరియాకు కొరత లేదని రైతులకు సరిపడా నిల్వలున్నాయని గప్పాలు చెప్పుకోవడం తప్పా ఆచరణలో మాత్రం కానరావడంలేదు. దుబ్బాక పట్టణంలో సోమవారం యూరియా బస్తాల లారీ రావడంతో తెల్లవారక ముందే దుకాణం వద్దకు వందలాది మంది రైతులు తరలివచ్చి లైన్ కట్టారు. వందల సంఖ్యలో రైతులు ఉండడంతో ఒక్కో రైతుకు ఆధార్‌కార్డు, పాస్‌బుక్ తీసుకుని 2 బస్తాల చొప్పున పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు.
దొరకని రైతుల ఆందోళన
క్యూలో వేచి ఉన్నా చాలామంది రైతులకు యూరియా దొరకకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా లేక తమ పంటలు పాడైతున్నాయని ఇంకా ఎన్ని రోజులు ఈ తిప్పలు పడాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు సరిపడా యూరియాను తెప్పించి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.