
రేషన్ కార్డుల పంపిణీ రసాభాస
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి
చేపడుతున్న రేషన్ కార్డుల పంపిణీ
కార్యక్రమం ఆదివారం గజ్వేల్‌లో
రసాభాసగా మారింది. నేతలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహికి దిగారు. ఈ సందర్భంగా పలువురు నాయకుల చొక్కాలు చిరిగిపోయాయి. ఫలితంగా
ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో మరోసారి కాంగ్రెస్ విభేదాలు బయటపడ్డాయి.
మంత్రి వివేక్ సమక్షంలో మరోసారి బయటపడ్డ విభేదాలు
గజ్వేల్/వర్గల్(గజ్వేల్)/ములుగు (గజ్వేల్)/జగదేవ్‌పూర్ (గజ్వేల్): ఇచ్చిన హామీలు నెరవేరుస్తూనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తుందని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం వర్గల్ మండలం శాకారం టీజీఆర్ గార్డెన్స్ వేదికగా జిల్లా కలెక్టర్ హైమావతి, ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిలతో కలిసి ఆయన నూతన రేషన్‌కార్డుల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ...ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ల్ల మంజూరు ద్వారా పేదల సొంతింటి కలసాకారం చేస్తున్నామన్నారు. కాళేశ్వరం తప్పిదాలకు బాధ్యులైనవారిపై చర్యలు తప్పవన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఇప్పటికే జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. మెగా కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని ఆరోపించారు.
ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు
తమపై నర్సారెడ్డి వర్గీయులు దాడి చేశారని అసమ్మతి నేతలు విజయ్‌కుమార్, మల్లారెడ్డి, నాయిని యాదగిరిలు వేర్వేరుగా గజ్వేల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మొత్తానికి మంత్రి పర్యటనలో కాంగ్రెస్ విభేధాలు మరోసారి రచ్చకెక్కడం చర్చనీయాంశమైంది.
నర్సారెడ్డివి ఒంటెద్దు పోకడలు
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి ఒంటెద్దు పోకడలకు పాల్పడుతున్నారని అసమ్మతి నేతలు ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి, సీనియర్ నాయకులు నాయిని యాదగిరి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయ్‌కుమార్ ఆరోపించారు.
గజ్వేల్‌లో ఉద్రిక్తత, మంత్రి అసహనం
ప్రజాసంక్షేమమే పరమావధి: మంత్రి వివేక్