
స్నేహితుల దినోత్సవ వేడుకల్లో మహిళల సందడి
పచ్చని చెట్లు... చుట్టూ గుట్టలు, మధ్య నీటి సెలయేరు.. స్వచ్ఛమైన, ప్రకృతి రమణీయమైన వాతావరణంలో మహిళలు స్నేహితుల దినోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. మండలంలోని ఉమ్మాపూర్ మహాసముద్రం గండి వద్ద ఆదివారం హుస్నాబాద్ పట్టణానికి చెందిన పద్మావతి గ్రూప్ మహిళా సభ్యులు కలిసి స్నేహితుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. చేతులకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లను కట్టుకుని కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులతో కలిసి ఆటలు ఆడుతూ. పాటలు పాడుతూ ఆనందంగా గడిపారు. –హుస్నాబాద్
ప్రకృతి ఒడిలో పచ్చని స్నేహం

స్నేహితుల దినోత్సవ వేడుకల్లో మహిళల సందడి