
నీళ్లివ్వండి సారూ!
మర్కూక్(గజ్వేల్): మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామం నర్సన్నపేటలో నీటి ఎద్దడి నెలకొంది. గత 20 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినధులు పట్టించుకోకపోవడంతో ఆదివారం నర్సన్నపేట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టింకుని మిషన్ భగీరథ నీరు వచ్చేలా చేయాలని కోరారు.
కేసీఆర్ దత్తత గ్రామంలో
20 రోజులుగా రాని తాగు నీరు
రోడ్డుపై మహిళల నిరసన