
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు
హుస్నాబాద్: విద్యార్థుల్లో చదవాలనే సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి అన్నారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం శంషాబాద్ డిప్యూటీ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అయిలేని శ్రీనివాస్ రెడ్డి శనివారం గ్రంథాలయానికి పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగాలు సాధించిన వారు తమ వద్ద ఉన్న పుస్తకాలను గ్రంథాలయానికి ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని తెలిపారు. చదువు ఉంటే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మాజీ ఎంపీపీ వెంకట్, సత్యనారాయణ, అశోక్, రిటైర్డు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రంగనాయక సాగర్‌పై
హెచ్చరిక బోర్డు
చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌పై నిఘా లేకపోవడంతో పర్యాటకులు ప్రమాదాలకు గురవుతున్నారని రంగనాయకా.. రక్షణ ఏది? అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన పోలీ సులు శనివారం రిజర్వాయర్‌పై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఈ ప్రాంతాల్లోకి వెళ్లొద్దని సూచనలు చేశారు. ఎస్‌ఐ సైఫ్ అలీ మాట్లాడుతూ.. ప్రతిరోజు సాయంత్రం సాగర్ కట్టపై పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆకతాయిలపై నిఘా ఏర్పాటు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని, కట్టపై బైక్ రైడింగ్ నిషేధించామని పేర్కొన్నారు.
‘భగీరథ’మరమ్మతులు ప్రారంభం
వర్గల్(గజ్వేల్): ‘భగీరథ లీకై ంది..తోట చెరువైంది’ శీర్షికతో శనివారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. స్పందించిన మిషన్ భగీరథ అధికారులు మండలంలోని గౌరారం వద్ద లీకేజీకి గురైన పైపులైన్ వద్ద మరమ్మతు పనులు ప్రారంభించారు. జేసీబీ యంత్రంతో తవ్వకాలు జరిపి లీకేజీని గుర్తించారు. చీకటిపడే వరకు పనులు కొనసాగించారు. ఆదివారం మరమ్మతులు పూర్తవుతాయని అధికారులు తెలిపారు. కాగా కూరగాయల తోట, పొలాల్లో నీరు బయటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో అలాగే నిలిచిపోయింది.
గడువు ముగిసిన
మందులు ఉండొద్దు
డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్
సిద్దిపేటకమాన్: గడువు ముగిసిన మందులు నిల్వ ఉండకుండా చూసుకోవాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆవరణలోని టీ హబ్‌ను, సెంట్రల్ డ్రగ్ స్టోర్‌ను డీఎంహెచ్‌ఓ శనివారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరోగ్య కేంద్రాల నుంచి వచ్చిన బ్లడ్ శాంపిల్స్‌ను పరీక్షలు నిర్వహించి ఫలితాలను అదే రోజు పంపించాలని సూచించారు. డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రేవతి, టీహబ్ మేనేజర్ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు