
పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టాలి
● కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ● జిల్లా కాంగ్రెస్ సమీక్ష సమావేశం
గజ్వేల్: జిల్లాలో కాంగ్రెస్ పటిష్టతపై నాయకులు దృష్టి పెట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ విషయాన్ని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె సూచించారు. త్వరలోనే జిల్లాలో పర్యటించి సమస్యలను తెలుసుకుంటానని వెల్లడించారు. కలిసికట్టుగా పనిచేసి పార్టీకి పూర్వవైభవం తేవడానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నర్సారెడ్డితోపాటు టీపీసీసీ నేతలు పాల్గొన్నారు.