
యూరియా నిల్వ చేస్తే చర్యలు
జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి
దుబ్బాకటౌన్: యూరియాను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి స్పష్టం చేశారు. మంగళవారం రాయపోల్ మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లి, అనాజీపూర్‌లలో సలు ఫర్టిలైజర్ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా విక్రయాలను, బిల్లు బుక్, స్టాక్ రిజిస్టర్ లను, ధరల పట్టికలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యూరియాను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు.