
నానో యూరియాతో రైతులకు మేలు
బెజ్జంకి(సిద్దిపేట): నానో యూరియా, డీఏపీ వినియోగించడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏఓ సంతోష్ అన్నారు. మండలంలోని కల్లెపెల్లిలో సోమవారం పత్తి పంటను పరిశీలించా రు. అనంతరం మాట్లాడుతూ యూరియాను మో తాదుకు మించి వాడితే చీడపీడల ఉధృతి కూడా పెరుగుతుందన్నారు. నానో యూరియా ద్రవ రూపంలో తక్కువ ధరకే లభిస్తుందని తెలిపారు. వర్షాల కారణంగా పత్తి చేనులో నీరు నిలిస్తే కాపర్ ఆక్సీ క్లోరైడ్ మూడు గ్రాములు లీటర్ నీటిలో కలిపి చెట్టు మొదళ్లలో పోయాలని చెప్పారు.అనంతరం బెజ్జంకి, కల్లెపెల్లి గ్రామా లలోని ఫ్యాక్స్, ఎరువుల దుకాణాలను తనిఖీచేసి యూరియా నిల్వలు, రికార్డులను పరిశీలించారు.
వినియోగం పెంచాలి
తొగుట(దుబ్బాక): నానో యూరియా వినియో గాన్ని పెంచేలా డీలర్లు కృషి చేయాలని దుబ్బాక ఎడీఎ మల్లయ్య కోరారు. స్థానిక రైతు వేదికలో ఎరువుల డీలర్లకు నానో యూరియాపై సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీలర్లు నానో యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు కొనుగోలు చేసిన వెంటనే బిల్లులు ఇవ్వాలని, స్టాక్ బోర్డు ఏర్పాటు చేసుకోవాల సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ మోహన్ పాల్గొన్నారు.
పత్తిలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
జగదేవ్‌పూర్(గజ్వేల్): పత్తి పంటలో రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని ఏఓ వసంతరావు సూచించారు. మండలంలోని అలిరాజ్‌పేటలోని పలువురి పత్తి పంటలను సోమవారం పరిశీలించారు. ఇటీవల కురిసిన అధిక వర్షాల వల్ల తీసుకో వాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించా రు. అనంతరం మాట్లాడుతూ ప్రస్తుతం పంట శాఖీయదశ నుంచి గూడదశలో ఉందన్నారు. అక్కడక్కడ పారవిల్ట్ కనిపిస్తుందని, దీని వల్ల మొక్కల ఆకులు ఎండిపోయినట్లు కనిపిస్తాయని వివరించారు. నివారణకు పొలంలో ఉన్న నీటిని బయటకు పంపించాలని సూచించారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మందులు పిచికారీ చేయాలని చెప్పారు.

నానో యూరియాతో రైతులకు మేలు