
మొక్కలు సంరక్షించడం అందరి బాధ్యత
ఎస్‌ఐ కీర్తిరాజు
దుబ్బాకరూరల్: వనమహోత్సవంలో భాగంగా మండలంలోని పెద్దగుండవెళ్లిలో ఎస్‌ఐ కీర్తిరాజు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మొక్కలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయని చెప్పారు.ప్రతి ఒక్కరు విధిగా ఐదు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అదే విధంగా గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఛైర్మన్ మహేశ్ ఆయనకు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో వైస్ ఛైర్మన్ మల్లుగారి ప్రేమ్, కార్యదర్శి యాదగిరి, పరశురాములు, శ్రీకాంత్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
ఐదు మొక్కలు నాటాలి
హుస్నాబాద్‌రూరల్: స్వశక్తి మహిళలు వనమహోత్సవంలో పాల్గొని ఇంటింటికీ ఐదు మొక్కలు నాటాలని ఏపీఎం భిక్షపతి సూచించారు. పోతారం(ఎస్) గ్రామంలో స్వశక్తి మహిళలతో కలిసి వనమహోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు ఆహ్లాదకరంగా ఉండాలంటే ఇంటి ఎదుట మొక్కలు నాటుకోవాలన్నారు. మునగ, జామ, నిమ్మ, కరివేప, తులసి మొక్కలు నాటితే అవి మన ఆర్యోగానికి ఉపయోగపడుతాయని చెప్పారు. కార్యక్రమంలో సీసీలు రవీందర్, సీఏ కనకతార తదితరులు పాల్గొన్నారు.
మొక్కలతోనే మనుగడ
చిన్నకోడూరు(సిద్దిపేట): చెట్లను పెంచడం ద్వారా నే మానవ మనుగడ సాధ్యమవుతుందని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, ఏపీఎం ఆంజనేయులు అన్నారు. సోమవారం చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ, ఖాళీ స్థలా ల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ఏపీఓ స్రవంతి, సీసీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

మొక్కలు సంరక్షించడం అందరి బాధ్యత