
కాంగ్రెస్ పార్టీలో చేరికలు
చేర్యాల(సిద్దిపేట): పట్టణకేంద్రంలోని పదో వార్డుకు చెందిన పలు పార్టీల నాయకులు సోమ వారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దాసరి శ్రీకాంత్, వార్డు ఇన్‌చార్జి చింతల మల్లేశం ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేర్యాలలో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని, పార్టీలో చేరిన యువత అందుకు కృషి చేయాలన్నారు. పార్టీలో చేరిన పలువురు మాట్లాడుతూ ప్రతాప్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తూ స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లేశం, నాయకులు చంద్రయ్య, లక్ష్మీనారాయణ, నరేంద ర్, సతీశ్, రాకేష్‌కృష్ణన్, నాని, సన్ని, సదానందం ఖలీం పాష, అరవింద్, హరీశ్, భాను, ప్రసాద్, రాజేశ్, అరవింద్, సోను, హర్షవర్ధన్, బాలరాజ్, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.