
కొత్త రేషన్‌కార్డులతో నెరవేరిన కల
బెజ్జంకి(సిద్దిపేట): రేషన్‌కార్డుల కోసం పదేళ్లుగా కంటున్న పేదల కల ఇప్పటికి నెరవేరిందని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. స్థానిక సీఎన్‌హెచ్ గార్డెన్స్‌లో సోమవారం పలువురు లబ్ధిదారులకు మంజూరైన కొత్త రేషన్‌కార్డులు, సీఎం సహాయనిధి, కల్యాణలక్ష్మి, షాది ము బారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రేషన్‌కార్డులు ఇచ్చారని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే కొత్త కార్డులు మంజూరయ్యాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రజలను పట్టించుకోలేదని ఆరోపించారు. మండలంలో రెండు విడతల్లో 901 రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ ప్రవీణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దామోదర్, పార్టీ అధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, ఆలయ కమిటీ చైర్మన్ ప్రభాకర్, పోచయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయన బాలికల పాఠశాలలో రూ.7.15 లక్షలతో నిర్మించనున్న నూతన భవిత కేంద్రానికి, అలాగే రామసాగరంలో నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ చేశారు. అదేవిధంగా వాటర్‌ట్యాంక్, దాచారంలో నూతన పంచాయతీ భవనం, అంగన్‌వాడీ కేంద్రం పాఠశాలలో వంటశాలతోపాటు సీసీ రోడ్లు ప్రారంభించారు.
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి