
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సీఐటీయూ జిల్లా కోశాధికారి భాస్కర్
తొగుట(దుబ్బాక): గత ఎన్నికల సమయంలో పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి గొడ్డుబర్ల భాస్కర్ డిమాండ్ చేశారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం మండల స్థాయి పంచాయతీ కార్మికుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలన్నారు. 60 యేళ్లు నిండిన కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్‌గా రూ.5 లక్షలు అందజేయాలని కోరారు. మల్టీపర్పస్ విధా నాన్ని రద్దు చేస్తామని, కార్మికులకు కనీస వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హమీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల వేతనాలు మంజూరు చేస్తే పంచాయతీ కార్యదర్శులు కార్మి కుల వేతనాల్లో కోతలు విధిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు ఏడాదికి రెండు జతల యూనిఫామ్స్ అందించాలని నిబంధ న ఉన్నా సకాలంలో అందించడంలేదని వాపోయా రు. చెప్పులు, నూనె, గ్లౌజులు, సబ్బులు, కనీస వసతులు అందించకుండా కార్మికులకు ఇబ్బందు లకు గురిచేయడం తగదన్నారు. అనంతరం మండ ల నూతన కమిటీని ఎంపిక చేశారు. అధ్యక్షుడిగా నర్సింహులు, ఉపాధ్యక్షుడిగా భిక్షపతి, కార్యదర్శిగా మాణిక్యం, సహాయ కార్యదర్శులుగా పోశ య్య, అక్కవ్వ, స్వామి, సాయిలు, కనకరాజు, కోశాధికారిగా ప్రభాకర్ తదితరులను నియమించారు.