
ఆలయ భూములు అన్యాక్రాంతం
హిందు ధార్మిక సంఘం నాయకుడు మల్లేశం యాదవ్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని మోహినిపుర వెంకటేశ్వరస్వామి ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని సిద్దిపేట హిందు ధార్మిక సంఘాల నాయకుడు ఉడుత మల్లేశం యాదవ్ ఆరోపించారు. పట్టణంలోని వెంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో సోమవారం ఆయన మాట్లాడారు. ఆలయంలో గతంలో ఆర్డీఓగా విధులు నిర్వహించిన వెంకట నరసయ్య ఐదెకరాలు అసైన్డ్ భూమిని తన వంశస్థులే శాశ్వత చైర్మన్‌గా ఉండేలా ఒత్తిడి తెచ్చా రని ఆరోపించారు. కానీ ఆలయం మాత్రం సిద్ది పేట ప్రజల సహకారంతోనే నిర్మాణం జరిగింద న్నారు. ఐదెకరాల స్థలం ఒక సంవత్సరం మాత్రమే ఆలయం పేరు మీద ఉండి తదనంతరం ఆ భూమి లో నాలుగెకరాలు తన కుమారుల పేరు మీద మార్చారని ఆరోపించారు. చివరకు ఆలయం పేరు మీద ఒక్క ఎకరం మాత్రమే మిగిల్చారని వాపోయారు. నాటి నుంచి నేటి వరకు ఒక్క వంశంవారే గుడి చైర్మన్‌గా ఉంటున్నారన్నారు. ఆలయ భూము లు అన్యాక్రాంతం విషయంపై అధికారులు, గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.