
కొమురవెల్లిలో భక్తుల గిరి ప్రదక్షిణ
అమ్మవార్లకు శ్రావణ పూజలు
శ్రావణ మాసం పురస్కరించుకుని కొమురవెల్లి మల్లికార్జున స్వామి గిరి ప్రదక్షిణను భక్తులు ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండీ గ్రామానికి చెందిన సుమారు 150 మంది భక్తులు శుక్రవారం ప్రదక్షిణ చేశారు. తెల్లవారు జామునుంచే గిరి ప్రదక్షిణ చేసి స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– కొమురవెల్లి(సిద్దిపేట)
జిల్లాలో శ్రావణమాస సందడి ప్రారంభమైంది. తొలి శుక్రవారం అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. జిల్లా కేంద్రంలోని సంతోషిమాత, పార్వతీమాత, లలితా పరమేశ్వరి, రేణుకా ఎల్లమ్మ, వాసవికన్యకాపరమేశ్వరి ఆలయాలతో పాటు పలు ఆలయాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు కుంకుమార్చన, ఒడిబియ్యం, పుష్పార్చన తదితర కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఆలయ ప్రాంగణాలు అమ్మవారి నామస్మరణతో మార్మోగాయి. – ప్రశాంత్‌నగర్(సిద్దిపేట)

కొమురవెల్లిలో భక్తుల గిరి ప్రదక్షిణ

కొమురవెల్లిలో భక్తుల గిరి ప్రదక్షిణ

కొమురవెల్లిలో భక్తుల గిరి ప్రదక్షిణ