
ఓపెన్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఉమ్మడి మెదక్ జిల్లా ఓపెన్ స్కూల్ విధానంలో నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షలకు పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల అయ్యిందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆగస్టు 5వరకు, రూ.50 అపరాధ రుసుముతో ఆగస్టు 15 వరకు చెల్లించే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలకు జిల్లా ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ వెంకటస్వామి (8008403635)ని సంప్రదించాలన్నారు.
27న హాఫ్ మారథాన్
సిద్దిపేటకమాన్: జిల్లా కేంద్రంలో ఈ నెల 27న నిర్వహించనున్న హాఫ్ మారథాన్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఏసీపీ రవీందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం మారథాన్ టీషర్టులను శుక్రవారం ఏసీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజు రన్నింగ్, వాకింగ్ చేయడం చాలా అవసరమన్నారు. శారీరకంగా, మానసికంగా బలంగా లేకపోవడం వల్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ఇలాంటి రన్నింగ్ రేస్‌లు సమాజానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ రన్‌కు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని అందరూ పాల్గొనాలని అన్నారు. కార్యక్రమంలో రన్నర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రంగాచారి, కౌన్సిలర్ బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ ప్రవేశాలకు లాస్ట్‌చాన్స్
దోస్త్ స్పెషల్ ఫేస్ ఈనెల 31వరకు
సిద్దిపేటఎడ్యుకేషన్: డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందేందుకు ఉన్నత విద్యామండలి దోస్త్ స్పెషల్ ఫేస్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ సందర్భంగా శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడారు. డిగ్రీలో ప్రవేశాలకు గతంలో దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు ఇది మంచి అవకాశమన్నారు. ఈ విద్యాసంవత్సరానికి డిగ్రీలో అడ్మిషన్ పొందేందుకు ఇది చివరి అవకాశమని చెప్పారు. కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 31వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చన్నారు. ఆగస్ట్ 3న సీట్లను అలాట్‌మెంట్ ఉంటుందన్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్ట్ 6వరకు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి, సీసీఓటీపీతో వ్యక్తిగతంగా కళాశాలను సందర్శించి ధ్రువపత్రాలను సంబంధిత ప్రిన్సిపాల్‌కు సమర్పించి ఫీజు చెల్లించి తమ సీటును దృవీకరించుకోవాలని చెప్పారు. దోస్త్ కోఆర్డినేటర్ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ మూడు విడతలలో సీట్లు పొందని విద్యార్థులు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా స్పెషల్ ఫేస్‌ను ఉపయోగించు కోవచ్చన్నారు. ఇప్పటి వరకు దోస్త్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోని వారి ప్రస్తుతం రూ. 400లు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

ఓపెన్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల