
అధికారుల తీరు మారాలి
సీనియర్ యోగాసన పోటీలు
దౌల్తాబాద్ (దుబ్బాక): అధికారుల పనితీరు మెరుగుపడాలని కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసే సమయంలో సిబ్బంది లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరిగా సమాధానం చెప్పకపోవడంతో వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాథమిక వ్యవసాయ సహకార కార్యాలయ్యాన్ని ఆకస్మికంగా తనీఖీ చేశారు. ఇక్కడికి వచ్చిన యూరియా ఎంత? ఎంత మంది రైతులకు పంపీణీ చేశారని అధికారులను అడిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పని తీరు మారకపోతే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలోని తండాలో 19 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను కేటాయించారు. తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ బాలికల పాఠశాలను తనీఖీ చేశారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
హుస్నాబాద్‌రూరల్: నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అధికారులను కలెక్టర్ కె.హైమావతి ఆదేశించారు. శుక్రవారం ఐఓసీ భవనంలో ఆర్డీవో రాంమూర్తితో కలిసి వివిధ శాఖల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... హుస్నాబాద్ నుంచి సుందరగిరి వరకు ఫోర్‌లైన్ రోడ్డు పనులకు రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాలు, చెట్లను తొలగించే చర్యలు చేపట్టాలని ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాల పనులు పూర్తి చేయాలన్నారు. మున్సిపాల్టీలో వివిధ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సమావేశంలో వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న జిల్లా కేంద్రంలో ిసీనియర్ యోగాసన పోటీలు నిర్వహించనున్నట్లు తోట అశోక్, శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. యోగాసన పోటీలలో పాల్గొనే సభ్యులు ఆదివారం ఉదయం 7లోపు వ్యాస మహర్షి యోగా సెంటర్‌లో రిపోర్ట్ చేయాలన్నారు. సీనియర్ విభాగంలో 18 – 28 ఏళ్లు, 28–35 ఏళ్లు, 35–45 ఏళ్లు, 45– 55 ఏళ్ల వారీగా జరుగుతాయన్నారు. ఈ విభాగాల్లో ఎంపికైన వారు ఆగస్టు7,8లలో ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి ఛాంపియన్‌షిప్‌కు ఎంపికవుతారన్నారు. పూర్తి వివరాలకు 9948110433 ను సంప్రదించాలన్నారు.
పనితీరు మెరుగుపడాలి
కలెక్టర్ హైమావతి
పలు ప్రభుత్వ కార్యాలయాల తనిఖీ