
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలి
వర్గల్(గజ్వేల్): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం వర్గల్ మండల కేంద్రంలో బొల్లిపల్లి తిరుపతిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాలలో ఆయన ప్రసంగించారు. ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగరాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు కై వసం చేసుకోవాలన్నారు. గజ్వేల్ ఎన్నికల ఇన్‌చార్జి ఎల్లు రాంరెడ్డి మాట్లాడుతూ విభేదాలు లేకుండా పార్టీశ్రేణులు కలిసికట్టుగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో సత్తాచాటాలన్నారు. రాష్ట్ర నాయకుడు నందన్‌గౌడ్ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికలలో ఉత్సాహంగా పనిచేసి విజయాలు నమోదుచేసిన రీతిలో స్థానికంలో కూడా శ్రమించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు కనకయ్య, బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ గుప్తా, యాదగిరి, రవి, శంకర్ గౌడ్, ప్రదీప్‌గౌడ్, రవీందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్