
అందుబాటులో సరిపడా ఎరువులు
జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి
కొండపాక(గజ్వేల్): వానాకాలం సీజన్‌కు అవసరమయ్యే ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి అన్నారు. కుకునూరుపల్లి మండలంలోని ఎరువుల దుకాణాలను బుధవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల క్రయ విక్రయాల రిజస్టర్లను పరిశీలించారు. ఈసందర్భంగా స్వరూపరాణి మాట్లాడుతూ ఎరువుల కొరత ఉన్నట్లు వస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా వర్షాకాలంలో వివిఽ ద పంటలకు ఏ సమయంలో ఎంత అవసరపడతాయో గుర్తించి ఎరువులు ఆగ్రోస్, పీఏసీఎస్ సహకార సంఘాలకు సరఫరా చేస్తున్నామన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్మిన దుకాణాదారుల లైసెన్సులను రద్దు చేస్తా మంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి గోవింద రాజు, ఎస్సై శ్రీనివాస్, పోలీసులు, దుకాణాదారులు, వ్యవ సాయ విస్తరణాధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్యనందించాలి
మోడల్ స్కూల్స్
అదనపు డైరెక్టర్ శ్రీనివాసాచారి
సిద్దిపేటరూరల్: విద్యార్థులకు మంచి విలువలతో కూడిన విద్యను అందించాలని మోడల్ స్కూల్స్ అదనపు డైరెక్టర్ శ్రీనివాసాచారి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మోడల్ స్కూల్‌ను శ్రీనివాసాచారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యా బోధనను, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, ఏఎంఓ రవికుమార్, ప్రిన్సిపాల్ రవీందర్ గౌడ్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
బీఎంఎస్ రాజీలేని పోరాటం
గజ్వేల్: కార్మికుల సమస్యల పరిష్కారమే లక్షంగా బీఎంఎస్ రాజీలేని పోరాటాన్ని కొనసాగిస్తోందని ఆ యూనియన్ ప్రజ్ఞాపూర్ రాణే పరిశ్రమ శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి సల్ల శ్రీనివాస్‌లు అన్నారు. బుధవారం బీఎంఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కంపెనీ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీఎంఎస్ ద్వారానే కార్మికులకు మేలు జరుగుతుందని అన్నారు. స్థానిక రాణే పరిశ్రమలో సీఐటీయూ నాయకులు సమస్యలను గాలికొదిలేసి కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు పులుగం శ్రీనివాస్, పరశురాం, నజీర్ తదితరులు పాల్గొన్నారు.
నెంటూరు బస్సు పునరుద్ధరణ
వర్గల్(గజ్వేల్): ఆర్టీసీ బస్సు కోసం పల్లె ప్రజల సుదీర్ఘ నిరక్షణకు తెరపడింది. ‘నెంటూరు–జేబీఎస్’ ఆర్టీసీ బస్సును పునరుద్ధరించారు. ఏళ్ల తరబడి ఆర్టీసీ సేవలు దూరమైన వర్గల్ మండలంలోని అనేక గ్రామాల ప్రజలకు మేలు చేకూరింది. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ డిపో ద్వారా పునరుద్ధరించిన ‘నెంటూరు–జేబీఎస్’ ఆర్టీసీ బస్సును బుధవారం డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, నియోజకవర్గ ప్రచార చైర్మన్ రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. బస్సు రాకతో ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, నర్సారెడ్డికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వంటిమామిడి ఏఎంసీ చైర్మన్ విజయమోహన్, నాయకులు రంగారెడ్డి, విద్యాకుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

అందుబాటులో సరిపడా ఎరువులు

అందుబాటులో సరిపడా ఎరువులు