
గురువారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2025
‘రూల్స్ చెప్పొద్దు.. చెప్పింది చేయాలి’ అంటూ అధికారులపై అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. మాటవినని వారిపై మంత్రులకు ఫిర్యాదులు చేస్తున్నారు. కొంత కాలంగా ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక దగ్గరి నుంచి బదిలీల వరకు తాము చెప్పింది చేయాలని అధికార పార్టీ నేతలు అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కింది స్థాయి, జిల్లా స్థాయి అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది.
– సాక్షి, సిద్దిపేట
న్యూస్‌రీల్